ప్రధాని నరేంద్ర మోడితో సిఎం జగన్‌ భేటీ

CM Jagan meets with PM Narendra Modi
CM Jagan meets with PM Narendra Modi

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తన ఒక్క రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడితో ఈరోజు సాయంత్రం భేటీ అయ్యారు. ప్రధానికి పుష్పగుచ్ఛం అందజేసిన జగన్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఏపికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల అమలు, రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, మండలి రద్దు తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జగన్ వెంట వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ తదితరులు ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/