పుష్ప యూనిట్ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బృందం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసింది.

సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు గురవడం గమనార్హం. ‘పుష్ఫ’ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలకి కోత విధిస్తూ .. కొన్ని అభ్యంతరకర సంభాషణల దగ్గర మ్యూట్ చేయాలని సూచించారు.

  • ప్రతీ సినిమా ప్రారంభంలో మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే స్టాట్యుటరీ వార్నింగ్ పడడం కామన్. అయితే సినిమాలో అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ వార్నింగ్ తో కూడిన టెక్స్ట్ డిస్ ప్లే చేస్తూ కొన్ని మధ్యం బ్రాండ్స్ ను బ్లర్ చేయాలి.
  • ఓ సీన్ లో వినిపించే లం.. క అనే బూతు డైలాగ్ ను మ్యూట్ చేయాలి.
  • మరో సీన్ లో ఇంకో బూతు డైలాగ్ దగ్గర మ్యూట్ చేయాలి.
  • ఓ సన్నివేశంలో ఒకరి చెయ్యి కట్ అయ్యే సన్నివేశాన్ని బ్లర్ చేయాలి.
  • ఒక హింసాత్మక సన్నివేశంలో ఎక్కువ బ్లడ్ కనిపించకుండా బ్లర్ చేయాలి.
  • పుష్పరాజ్ ఓ పోలీసాఫీసర్ తో డ్రగ్ పార్టీలో ఉన్నప్పుడు వచ్చే లం… క అనే డైలాగ్ ను మ్యూట్ చేయాలనీ సూచించారు.