దసరా బరిలో పుష్ప 2 ..?

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘ ‘పుష్ప : ది రైజ్’ ‘ చిత్రం.. డిసెంబర్ 17న పాన్ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో బన్నీ తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. ఫిబ్రవరి నుండి పార్ట్ 2 సెట్స్ పైకి రాబోతుంది. కేవలం 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనీ సుకుమార్ ఫిక్స్ అయ్యాడట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే.. మే నెల నాటికి టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనేది సుకుమార్ ఆలోచనగా తెలుస్తోంది.
ఇక సెకండ్ పార్ట్ లో మదర్ సెంటిమెంట్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉందట. దాన్ని నిడివి తగ్గించి.. ఫహద్ ఫాజిల్ కు , బన్నీకి మధ్య వచ్చే సీన్స్ లెంత్ పెంచే ఆలోచనలో ఉందట టీమ్. అలాగే బన్నీ, రష్మికల మధ్య రొమాంటిక్ సీన్స్ ను కూడా పెంచుతున్నారట. ఇదిలా ఉంటె పుష్ప 1 కలెక్షన్ల ఫై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యానించారు.
“ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో ఆయా నటులకు కూడా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే, హిందీలో విడుదలైన ‘పుష్ప’కు కూడా భారీ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. హిందీ సినిమాలు కూడా అంత కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి” అని కరణ్ జోహర్ తెలిపారు.