ఉప్పల్ స్టేడియం కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కరెంట్ అధికారులు

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. కోట్లలో బకాయిలు ఉండడం తో స్టేడియానికి కరెంట్ నిలిపివేసారు. కరెంటు బిల్లులు కట్టక పోవడంతో… గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై విద్యుత్ శాఖ కేసు వేసింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. కోర్టును ఆశ్రయించింది.

కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో… వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు విశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు. దాదాపు మూడు కోట్ల వరకు బకాయి ఉందని అధికారులు చెపుతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించడంలో హెచ్‌సీఏ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, అలాగే విద్యుత్‌ను యధావిధిగా వాడుకుంటున్నారని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు