కెసిఆర్ పుట్టకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు: కెటిఆర్

If KCR was not born, Telangana state would not have come: KTR

సిద్దిపేట: ఈరోజు సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావుతో కలిసి ఐటీ టవర్స్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేటను చూసి అసూయపడేలా మంత్రి హరీశ్ రావు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. సిద్దిపేటలో కెసిఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేది కాదని, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని కెటిఆర్ అన్నారు. ఉద్యమ నాయకుడిని అందించిన జిల్లా సిద్దిపేట గడ్డని చెప్పారు.

తెలంగాణ మోడల్ అంటే సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధి అని కెటిఆర్ అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచి అని.. మిషన్ భగీరథకు పునాది కూడా సిద్దిపేటలోనే పడిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గాన్ని సిద్దిపేటలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సారి హరీశ్ రావును లక్షా 50 వేల మెజారిటీతో గెలిపించాలన్నారు.

సిద్దిపేటలో ఐటీ హబ్ ను మరింత విస్తరిస్తామని కెటిఆర్ చెప్పారు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. ‘‘ఏ ప్రభుత్వం అందరికీ సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదు. తెలంగాణలో యువత ఎక్కువగా ఉంది. వారికి ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు. కేసీఆర్ కు హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలని కోరారు.