లైగర్ ప్లాప్ ఫై చిరు ప్రశ్న కు ధైర్యంగా సమాధానం చెప్పిన పూరి

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ జోష్ లోకి వచ్చాడు. ఆచార్య ప్లాప్ తో కాస్త నిరాశకు లోనయిన చిరు ..గాడ్ ఫాదర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లోకి వచ్చాడు. ఈ సక్సెస్ ను చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరితో పంచుకుంటున్నారు. బుధువారం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో వీడియో రూపంలో పంచుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణలు సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఇరువురు కూడా అనేక ప్రశ్నలు వేసుకున్నారు. కాగా లైగర్ ప్లాప్ ఫై పూరి రియాక్షన్ ను చిరు ఇన్ డైరెక్ట్ గా అడిగారు. దీనికి పూరి తనదైన స్టయిల్ లో సమాధానం చెప్పి ధైర్యం నింపారు.

‘‘సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వ‌స్తుంది. అదే ఫెయిల్యూర్ వ‌స్తే ఉన్న ఎన‌ర్జీ పోతుంది. స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌మొక జీనియ‌స్‌లాగా క‌నిపిస్తాం. అదే ఫెయిల్ అయితే ఫూల్‌లా క‌నిపిస్తాం. సినిమాకు ప‌ని చేసిన‌వాళ్లు, న‌మ్మినోళ్లు కూడా రివ‌ర్స్ అవుతారు. ర‌క ర‌కాల ఇబ్బందులుంటాయి. చాలా ప్రెష‌ర్స్ వ‌స్తాయి. ఆ స‌మ‌యంలో స్ట్రెంగ్త్ ఉంటేనే ధైర్యంగా ముందుకు వెళ్ల‌గ‌లుగుతాం. ఏదైనా దెబ్బ త‌గిలిన‌ప్పుడు ఓ హీలింగ్ టైమ్ ఉంటుంది. ఆ టైమ్ త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఆస్తులు పోవ‌చ్చు, యుద్ధాలు జ‌ర‌గొచ్చు..అయితే ఎన్ని జ‌రిగినా హీలింగ్ టైమ్ ఒక నెల కంటే ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. మ‌ళ్లీ నెక్ట్స్ ప‌ని చేసుకోవాలంతే. లైగ‌ర్ సినిమా చేసే ప్రాసెస్‌లో నేను మైక్ టైస‌న్‌తో షూటింగ్ చేయ‌టం, మంచి సెట్స్ వేసి వ‌ర్క్ చేశాం. మూడేళ్లు ఎంజాయ్ చేశాను. అయితే ఫెయిల్యూర్ వ‌చ్చింది. అది మ‌న చేతిలో లేదు. దానికి మ‌రో మూడేళ్లు ఏడ‌వ‌లేం క‌దా’’ అన్నారు. ప్రస్తుతం పూరి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.