RFCL ఉద్యోగ బాధితుడు హరీష్ మృతి ఫై బండి సంజయ్ దిగ్బ్రాంతి

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో (RFCL) పర్మినెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మనస్థాపంతో ముంజ హరీష్ (32) బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. హరీష్ మృతి పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుడి కుటుంబానికి తక్షణమే నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని కోరారు.

హరీష్ ఆత్మహత్యకు కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాల్లో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. దీనిపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

కమాన్ పూర్ మండలం గుండారం వద్ద హరీశ్ డెడ్ బాడీని పోలీసులు కనుగొన్నారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు హరీశ్ శుక్రవారం వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. RFCL ఉద్యోగం కోసం తన నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని, కొత్త కాంట్రాక్టర్ రాగానే తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఆవేదనం వ్యక్తం చేశాడు. దళారులను నమ్మి మోసపోయాయని వాపోయాడు.