డైరెక్టర్ గా మారిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

కమెడియన్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ..ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి..కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు.ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈయన..ఇప్పుడు డైరెక్టర్ గా మారాడు. తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా చేసాడు. క్రాంతి హీరోగా నటిస్తుండగా పృద్వి కూతురు శ్రీలు హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. తాజాగా చిత్రం గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన పృథ్వీరాజ్ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక ఈ మూవీ లో విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ కీలక పాత్రలు పోషించారు.