కమల్‌ నాథ్‌ ప్రభుత్వానికి నేడు బలపరీక్ష లేనట్టే

విశ్వాస పరీక్షను అజెండాలో చేర్చని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్

Kamalnath
Kamalnath

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈరోజు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశలు కన్పించడంలేదు. అజెంబ్లీ అజెండాలోని అంశాల్లో విశ్వాస పరీక్షను స్పీకర్ చేర్చలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ లో జ్యోతిరాదిత్య రూపంలో ముసలం మొదలైన విషయం తెలిసిందే. ఆరుగురు మంత్రులతోపాటు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, జ్యోతిరాదిత్య బిజెపి తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్రంలో కమల్ నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ రోజు విశ్వాసపరీక్ష జరుగుతుందనుకున్నారు. విశ్వాస పరీక్షకు వెనుకడుగు వేసేది లేదని సిఎం కమలనాథ్ కూడా ప్రకటించారు. అయితే అసెంబ్లీలో చేరాల్సిన ఈ అంశం చేర్చలేదు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాల తీర్మానం తప్పించి విశ్వాస పరీక్ష అంశం ఎజెండాలో కనిపించలేదు. కాగా, స్పీకర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బలపరీక్షకు సిద్ధమని సిఎం మరోసారి పునరుద్ఘాటించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/