హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్ పృథ్వి కూతురు

,

30 ఇయర్స్ పృథ్వి గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వి ..ఇప్పుడు తన కూతురు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. గతంలోనే తన కూతురు ఎంట్రీ ఫై కామెంట్స్ చేసాడు పృద్వి. తన కూతురు నటిగా ప్రత్యేకంగా గుర్తింపును అందుకోవాలని అనుకుంటుంది అని.. ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు పృథ్వీ కూతురు శ్రీలు హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని , త్వరలోనే విడుదల కాబోతుందని తెలిపారు.

ఇక ఈ సందర్భంగా నన్ను ఆదరించినట్లే నా కూతురుకి కూడా మీ సపోర్ట్ కావాలి అని పృథ్వీరాజ్ ఒక వీడియోలో వివరణ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును లభిస్తుంది అని నటనలో అలాగే డ్యాన్స్ లో కూడా తన కూతురు ఎంతో శిక్షణ తీసుకుందని తెలిపారు. ఇక ఈ సినిమా ద్వారానే పృథ్వీరాజ్ సన్నిహిత స్నేహితుడు కుమారుడు క్రాంతి కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ విషయంలో మరింత డోస్ పెంచాలని కూడా పృద్వి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.