ఈ హీరోలకు ఏమైంది..ఇలా న్యూడ్ గా పోజులు ఇస్తున్నారు..?

ప్రస్తుతం హీరోలంతా న్యూడ్ బాట పట్టారు. ఒకోరు కాకపోతే ఒకరు న్యూడ్ ఫోటోలకు పోజులు ఇస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. వీరి ఫోజులకు అమ్మాయిలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లైక్స్, షేర్స్ చేస్తూ రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సామాన్య ప్రేక్షకులు మాత్రం ఈ హీరోలకు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పుడెప్పుడో అమీర్ ఖాన్ ఓ సినిమాలో ఆలా న్యూడ్ ఫోటో షూట్ తో సంచలనం సృష్టించగా..రీసెంట్ గా విజయ్ దేవరకొండ అలాగే పోజ్ ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. విజయ్ నటిస్తున్న ‘లైగర్’ లోని ఓ సీన్ కోసం విజయ్ దేవరకొండ పూల బొకేని అడ్డుపెట్టుకుని న్యూడ్ గా కనిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా..టాలీవుడ్ హీరోయిన్ లు అనుష్క, సమంత, రష్మిక మందన్న హాట్ కామెంట్ లు చేశారు. నెటిజన్ ల నుంచి మాత్రం విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగానే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్.. న్యూడ్ గా ఫొటో షూట్ లో పాల్గొన్నాడు. అవి కూడా నెట్టింట వైరల్ గా మారి ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అయితే విజయ్ కి కాస్త ప్రశంసలు దక్కగా..రణవీర్ కు మాత్రం విమర్శలే వచ్చాయి. అమ్మాయిలని చూసి తను కూడా అలా చేయాలని ఇలా న్యూడ్ ఫొటో షూట్ చేశాడా? అని మండి పడ్డారు. ఓ నటి ఏకంగా రణ్ వీర్ ని సోషల్ మీడియా వేదికగా ఏకి పారేసింది. ఇక నిత్యం న్యూడ్ ఫొటో షూట్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూనమ్ పాండే కూడా రణ్ వీర్ పై విరుచుకుపడింది.

ఇక మీరు మాత్రమేనా నేను చేయలేనా అంటూ నటుడు విష్ణు విశాల్ సైతం న్యూడ్ ఫోటో సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఈ ఫొటోల కోసం తన భార్య గుత్తాజ్వాల ఫొటో గ్రాఫర్ గా మారిందని తను షేర్ చేసిన ఫొటోలకు ఈమెంట్ జత చేశాడు. దీనిపై కూడా నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా సింగర్ గీతా మాధురి భర్త యంగ్ హీరో నందు కూడా ఇదే బాటపడ్డాడు. న్యూడ్ పోజ్ తో ఫొటోలని నెట్టింట షేర్ చేశాడు. ‘రణ్ వీర్ సింగ్ ట్రెండ్ లో నేనూ జాయిన్ అయ్యా’ అంటూ కన్ను గీటుతున్న ఎమెజీని షేర్ చేశాడునందు. ఇలా వరుసపెట్టి ఫోటో షూట్ చేస్తుండడం తో ఈ హీరోలకు ఏమైందంటూ సినీ లవర్స్ , నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. మరి వీరి బాటలో ఇంకెంతమంది హీరోలు జాయిన్ అవుతారో చూడాలి.