ఆదితో ..పాయల్ రొమాన్స్

అది సాయి కుమార్ తో పాయల్ రొమాన్స్ లో మునిగిపోయింది. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అది కి సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ”తీస్ మార్ ఖాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి డైరెక్ట్ చేయగా.. ‘RX 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. తాజాగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా ‘సమయానికే’ అనే ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘సమయానికి తగు మాట్లాడవా.. సరసానికి చొరవే చూపవా.. నీ చూపే నా వైపే వేసెనే ఎర.. ఏదేదే చేసేసి చంపుతోందిరా..’ అంటూ సాగిన ఈ పాటలో హీరో – హీరోయిన్ రొమాన్స్ లో మునిగిపోయారు.

ఇందులో ఆది సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తుండగా.. పాయల్.. తన అందచందాలతో ఆకట్టుకుంది. సముద్రతీరాన షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్ గానూ బాగుంది. ఈ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. గాయని శృతి ఆలపించింది. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీ లో స్టూడెంట్ – రౌడీ – పోలీస్ వంటి మూడు వెరీయేషన్స్ ఉన్న పాత్రలో ఆది కనిపించనున్నారు. సునీల్ , పూర్ణ , కబీర్ సింగ్ , అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 19 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video