రైతులకు అన్ని రకాల వసతులు కల్పిస్తాం

Singireddy Niranjan Reddy
Singireddy Niranjan Reddy

హైదరాబాద్‌: రైతులకు అన్ని రకాల వసతులు మార్కెట్ యార్డుల్లో కల్పించంతోపాటు ఇతరత్రా ఉత్పన్నమయ్యే అన్ని సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి. రైతులకు మరింత చేరువ కావాలి అని ఉద్యోగులకు మార్కెటింగ్ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ లో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నుండి ఉన్నత శ్రేణి కార్యదర్శులుగా ఎనిమిది మందికి పదోన్నతి కల్పించినందుకు టీఎన్జీఓఏ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్ తదితరులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ పదోన్నతులు పొందిన కార్యదర్శులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఉద్యోగుల సమస్యలను రవీందర్ రెడ్డి ప్రస్తావించారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/