పంజాబ్‌లో కుప్పకూలిన మూడు అంతస్థుల భవనం

Building collapse in punjab
Building collapse in punjab

చండీఘ‌ర్‌: పంజాబ్‌ రాష్ట్రంలోని మోహాలీలో ఘోర ప్రమాదం సంభవించింది. మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడినట్టు సహాయక బృందాల సభ్యులు తెలిపారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/