కెసిఆర్ సాధించిన ప్రగతి చెరిపేస్తే చెరగని సత్యంః కెటిఆర్‌

KTR

హైదరాబాద్‌ః తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ వేశారు. కెసిఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు, మీడియా అంటాయని…. రూ. 3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత కెసిఆర్ దని చెప్పారు. ఇంత సాధించినా కెసిఆర్ ఏం చేశారని అంటున్నారని మండిపడ్డారు. కెసిఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి చెరిపేస్తే చెరగని సత్యమని అన్నారు. జై తెలంగాణ అని ట్వీట్ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని రాష్ట్రాల తలసరి ఆదాయాలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.