మీరేంటో నిరూపించుకోవటానికి వెనుకాడొద్దు!

జీవన వికాసం

ఆఫీసులో ప్రెజెంటేషన్స్ ఇవ్వటం, సమావేశాలకు సమన్వయ కర్తగా పనిచేయటం, వేదికలపై ప్రసంగించటం,.. నేటి కార్పొరేట్ సంస్కృతిలో తప్పనిసరి.. కానీ చాలా మంది అమ్మాయిలు ఆ బాధ్యతలను తీసుకోవటానికి , ముందుండి నడిపించటానికి వెనుకాడుతూ ఉంటారు . ఈ ఇబ్బందిని అధిగమించటానికి కెరీర్ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు..

మాటలతో ఆకట్టుకోవాలంటే:

మాట్లాడే అంశంపై ముందు పట్టు ఉండాలి . కొంత సాధన చేయాలి.. అపుడు తొందర పడకుండా ముందగుడు వేయగలరు.
మాట్లాడేటపుడు ఎదుటివాలా దృష్టిని ఎక్కువగా ఆకర్షించేవి హావభావాలే .. మనం చెప్పే విషయాలను ఎలాగూ ఒకటి, రెండు, మూడు.. అంటూ పాయింట్లుగా వివరిస్తుంటాం కదా.. ఆ ఒకటి , రెండూ అంటూ చేతివేళ్ళనే చూపించండి.. దీనివల్ల మీరు చెప్పేది ఏదైనా సరే ఎదుటివారి దృష్టిని మరల్చనీయదు..

సమావేశాల్లో సమన్వయ కర్తగా వ్యవహరించాల్సి నపుడు కంగారు పడొద్దు.. ప్రణాళికతో ముందుకెళితే అన్నీ క్రమ పద్దతిలో జరిగిపోతాయి..
అయితే,, దీన్ని నోటిమాటగా అనుకోవద్దు. ఓ పుస్తకంలో మీరు ప్రారంభం నుంచి చివరి వరకూ రాసుకోండి. స్నేహితుల సాయమూ తీసుకోండి.. కచ్చితంగా పూర్తి చేయగలరు..

ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పడు, అది వీలైనంత సూటిగా ఉండాలి . సింపుల్ గా గ్రాఫిక్స్, ఇమేజ్ లతో చూపించ గలగాలి.. ఇందుకు తగ్గట్టుగా సాధన చేస్తే మీరు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/andhra-pradesh/