ముఖ్యమంత్రి అయ్యేందుకు కెటిఆర్ సిద్ధంగా ఉన్నారుః మంత్రి పువ్వాడ

కాంగ్రెస్‌, బిజెపిలకు దమ్ముంటే తమ సీఎం అభ్యర్థి పేరు చెప్పాలి.. మంత్రి పువ్వాడ

minister-says-minister-puvvada-ajay-kumar

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ లో ప్రస్తుత సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కెటిఆర్ సిద్ధంగా ఉన్నారని, భవిష్యత్ లో ఆయనే సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి అజయ్ పాల్గొన్నారు.

ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరని.. కాంగ్రెస్‌, బిజెపిలకు దమ్ముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పాలని పువ్వాడ అజయ్ డిమాండ్‌ చేశారు. గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన ఘనత సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఖమ్మం నగరానికి తన అవసరం తీరిన రోజున రాజకీయాల నుంచి వైదొలుగుతానని మంత్రి చెప్పారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేక మంది అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అభివృద్ధి చేశామన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి రహిత కార్పొరేషన్‌గా నిలిచిందని అన్నారు.