బ్రహ్మాస్త్ర జంటను గుడిలోకి రానివ్వని భజరంగ్ దళ్ సభ్యులు

బ్రహ్మాస్త్ర జంటకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం దర్శనకు వెళ్లిన ఈ జంటను అక్కడి భజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. ఆలయంలో అడుగుపెట్టవద్దని వారంతా నిరసన తెలిపారు. దీనికి కారణం ఆలియా 11ఏళ్ల క్రితం చేసిన కామెంట్సే. తనకు బీఫ్ (ఆవు మాంసం)అంటే చాలా ఇష్టమని చెప్పిన ఓ క్లిప్ రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలియాపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన బ్రహ్మాస్త్ర మూవీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ… బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర పేరుతో ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల ఆమె బ్రహ్మాస్త్ర మూవీని చూడాలనుకుంటే చూడండి, ఆసక్తి లేకపోతే చూడకండి అంటూ చేసిన కామెంట్స్ కూడా ఆమెను వివాదంలో ఇరుక్కునేలా చేశాయి. ఇవన్నీ ఇప్పుడు చిత్ర యూనిట్ కు తలనొప్పిగా మారాయి.

ఇక బ్రహ్మాస్త్ర విషయానికి వస్తే..భారతదేశ చరిత్రలో భారీ బడ్జెట్​, అత్యాధునిక సాంకేతికతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేస్తున్నారు. దక్షిణాది భాషల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి డిస్ట్రిబ్యూట్​చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్​, ధర్మ ప్రొడక్షన్స్​, ప్రైమ్ ఫోకస్​, స్టార్​లైట్ పిక్చర్స్​సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త్రం సినిమాకు భారీగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నారు.