లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదురుకుంటున్న రామచంద్ర పిళ్లైతో ఎమ్మెల్సీ కవిత..

లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదురుకుంటున్న రామచంద్ర పిళ్లైతో ఎమ్మెల్సీ కవిత తిరుమల లో దర్శనం ఇవ్వడం ఫై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ పలు ఆరోపణలు కురిపించారు. పిళ్లై కంపెనీల్లో కవిత డైరెక్టర్ గా ఉన్నారని .. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత.. వారితో కలిసి వెళ్లడం అబద్దమా అని రఘునందన్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి పేపర్ లో వచ్చిన ఆర్టికల్ పై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోపక్క ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌ కోకాపేట్‌‌, నానక్‌‌రామ్‌‌గూడలోని రెండు ప్రాంతాల్లో 15 మంది అధికారుల ఈడీ టీమ్ సెర్చ్ చేసింది. కోకాపేట్‌‌లోని అరుణ్‌‌ రామచంద్రన్‌‌ పిళ్లై ఫ్లాట్‌‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, లక్నో, గుర్గావ్, నోయిడాలో ఏకకాలంలో దాడులు జరిపింది. సీబీఐ సేకరించిన డాక్యుమెంట్స్‌‌ ఆధారంగా మనీల్యాండరింగ్‌‌పై ఆధారాలు సేకరిస్తున్నది.