‘గుడ్‌నెస్‌ వాల్‌’ నిర్మించిన రైతులు

బైఠాయించి నిరసనలు

Protests by farmers in New Delhi
Protests by farmers in New Delhi

బోల్‌పూర్‌: ఢిల్లీ సరిహద్దుల్లో నిరవధిక ఆందోళన నిర్వహిస్తున్న రైతులతో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తో చర్చలు జరుపుతారని హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు.

రేపు కానీ మరుసటి రోజున కానీ తోమర్‌ రైతు నేతలతోచర్చలు జరుపుతారని అయిత ేనిర్దిష్టమైన సమయం తాను చెప్పలేనని పేర్కొన్నారు.

గడచిన 26 రోజులుగా ఢిల్లీ నాలుగుసరిహద్దుల్లో పంజాబ్‌, హర్యానా రైతులు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సంగతితెలిసిందే.

దశలవారీగా ఐదుపర్యాయాలు కేంద్ర మంత్రులు తోమర్‌, పియూష్‌గోయల్‌, వాణిజ్య సహాయ మంత్రులు చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు.

న్యూఢిల్లీలో 13 మంది రైతునేతలతోకూడా కేంద్రమంత్రి అమిత్‌షా చర్చలు జరిపారు. ఎంఎస్‌పిపై లిఖితపూర్వక హామీఇస్తామని, అలాగే సవరణలు చేస్తామని ప్రతిపాదించినా రైతులుఅంగీకరించలేదు. వివాదాస్పద మూడుచట్టాలను రద్దుచేయా ల్సిందేనని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/