అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 49 మంది పై నేర నిర్ధారణ

అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 49 మందిని దోషులుగా తేల్చారు. ప్రత్యేక కోర్టు ఇవాళ ఆ కేసులో తీర్పునిచ్చింది. ఆనాటి పేలుళ్లలో 56 మంది మరణించారు. 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జడ్జి ఏఆర్ పటేల్ ఇవాళ కేసును విచారించారు. ఈ కేసులో మరో 28 మందిని నిర్దోషులుగా తేల్చారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌పై వారిని కేసు నుంచి వేరు చేశారు. అయితే దోషులుగా తేలిన వారికి శిక్షను ఖరారు చేసేందుకు బుధవారం నుంచి విచారణ ప్రారంభంకానున్నది. సఫ్‌దార్ నగోరి, జావెద్ అహ్మద్, అటికూర్ రెహ్మాన్‌లను దోషులుగా ప్రకటించారు. 13 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసులో కోర్టు విచారణ ముగించింది. యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 16 కింద 49 మందిని నిందితులుగా చేర్చారు. పేలుళ్లపై 547 ఛార్జ్‌షీట్లు దాఖలు అయ్యాయి. 1163 మందిని
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/