రైతుల ఆందోళ‌న‌ నేటికి 26వ రోజు

నిరసన దీక్షలో తృణ‌మూల్ ఎంపిలు

farmers' agitation 26th day
farmers’ agitation 26th day

New Delhi: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళ‌న‌లు నేటికి 26వ రోజుకి చేరాయి . సింఘు బోర్డ‌ర్ వ‌ద్ద రైతులు ప‌ట్టు వ‌దల‌కుండా శీత‌ల ప‌వ‌నాల‌ను త‌ట్టుకుంటూ త‌మ ఉద్యమాన్ని కొన‌సాగిస్తున్నారు.

వివిధ రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టికే రైతు ఉద్య‌మానికి మ‌ద్దతు ప్ర‌క‌టించాయి.. ఈ ఉద్య‌మంలో రాజ‌కీయ‌పార్టీలు ప్ర‌త్య‌క్షంగా పాల్గొనేందుకు రైతులు ఇష్ట‌ప‌డ‌టం లేదు..

అందుకే గ‌తంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ క్రేజీవాల్ వ్య‌క్తిగ‌తంగా సింఘు బోర్డ‌ర్ కు వెళ్లి నిర‌శ‌న కొన‌సాగించారు.. తాజాగా తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు కూడా సింఘు బోర్డ‌ర్ కు వెళ్లారు.

.ఆ పార్టీ అధినేత్రి మమ‌తా బెన‌ర్జీ ఆదేశాల మేర‌కు ఆ పార్టీ ఎంపిలు డెరిక్ ఓ బ్రైన్, శ‌తాబ్ది రాయ్, ప్ర‌సూన్ బెన‌ర్జీ, ప్ర‌తిమ మోండ‌ల్, న‌దిముల్ హ‌క్ నేడు సింఘూ బోర్డ‌ర్ వ‌ద్ద రైతుల‌తో పాటు ఒక రోజు దీక్ష‌లో పాల్గొని సంఘీభావం ప్ర‌క‌టించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/news/nri/