డిసెంబర్ లో కళ్యాణ్ రామ్ ‘బింబిసార’

డిసెంబర్ నెలలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అవ్వగా..ఇప్పుడు కళ్యాణ్ రామ్ సైతం డిసెంబర్ నెలలోనే వస్తున్నాడు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్..ప్రస్తుతం బింబిసార అనే హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మోషన్ పోస్టర్ మినహా మారే అప్డేట్ రాలేదు. బింబిసార’ పూర్తి చారిత్రక చిత్రం కాదని తెలుస్తోంది. ఈ కథ టైమ్ ట్రావెల్ చుట్టూ నడుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇక డిసెంబర్ నెలలో భారీ చిత్రాలే రాబోతున్నాయి. డిసెంబరు 2న బాలయ్య ‘అఖండ’తో రానున్నారు. స్కైలాబ్(4వ తేదీ), గుడ్​లక్ సఖి(10వ తేదీ) థియేటర్లలోకి రానున్నాయి. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. ఆ తర్వాత వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత డిసెంబరు 24న వరుణ్​తేజ్ ‘గని’, నాని ‘శ్యామ్​సింగరాయ్’.. విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలు తమ డేట్స్ తో రెడీ గా ఉండగా..వీటి మధ్య కళ్యాణ్ రామ్ పోటీకి దిగుతున్నాడు. మరి కళ్యాణ్ రామ్ సక్సెస్ అవుతాడా..లేదా అనేది చూడాలి.