గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌పై ఎన్నికల కమిషన్ అభిశంసన

విధులు నిర్వహించడానికి అనర్హులని ప్రొసిడింగ్స్

Election Commission impeachment
Election Commission impeachment

Amaravati: ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్‌ గిరిజాశంకర్‌పై ఎన్నికల కమిషన్ అభిశంసన ప్రకటించింది.

2021 ఓటర్ల జాబితాలో ప్రచురణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఆ ఇద్దరు విధులు నిర్వహించడానికి అనర్హులని, వారిని తొలగించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం ప్రొసిడింగ్స్ జారీ చేశారు.

ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పి కూడా ఆ విధి నిర్వహించలేదని ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో ఆ ప్రొసీడింగ్స్ ఉంచారు. కాగా, అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం ఎస్ఈసీ తిరస్కరించింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/