బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ లో చేరబోతున్నాడా..?

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కీలక నేతలంతా పార్టీ ని కాంగ్రెస్ లో చేరుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతు రావు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం కాగా..తాజాగా సోమవారం భువనగిరి నేత కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా..తాజాగా మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. గత నెలలో కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బాపురావు పేరు లేదు. ఈ నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న బాపురావు…రోజు రోజుకు అనుచరులు కూడా పార్టీ మారాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుండడం..ఇప్పుడు మంత్రి కేటీఆర్ సైతం అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వకపోవడంతో పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. గౌరవం లేని పార్టీలో ఉండటం అనవసరమని భావించిన ఆయన బైబై చెప్పేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.