సామూహిక వంటశాలలతోనే సమస్య పరిష్కారం

బలమైన ఆహారం కావాలి:
సమతుల ఆహారంతో శరీరం, మనస్సు ఆరోగ్యం

మంచి ఆహారం మంచి మందులతో సమానం. సమతుల ఆహారంతో శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. గర్భస్త దశలోను, పుట్టాక రెండు సంవత్సరాలలోపు సరైన పోషకాహారం అందకపోతే శారీరక, మానసిక ఎదుగుదలకు శాశ్వత నష్టం జరుగుతుంది.

Meals canteen (File)

ఎత్తుకు తగ్గ బరువ్ఞలేకపోవడం, వయసుకు తగిన ఎత్తుపెరగక పోవడం వంటి సమస్యలకు కారణం పోషకాహార లేపమే. సన్నగా, పేలగా ఉండే పిల్లలు నిత్యం అనారోగ్యానికి గురికావడం, పాఠశాలకు గైర్హాజరవడం, తరగతి గదిలో ‘ధారణ లోపం, జ్ఞాపకశక్తి లోపం, వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అభ్యసనంపై ప్రభావం పడి వీరి భవిష్యత్తు కెరీర్‌ను కూడా ఆహారం ప్రభావితం చేస్తుంది.

ఆహార భద్రత లేకపోవడం వల్ల ప్రజల్లో నిత్యం అభద్రతా భావం, ఆందోళన, అనారోగ్యం, మరణరేటు పెరగడం, సామాజిక అశాంతి, ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడం, కుటుంబ కలహాలు, వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

అ వనిపై మనిషి ఆకలికి కారణం ఆహారం కొరత కాదు. ప్రజాస్వామ్యం కొరత అన్న వ్యాఖ్య 21శ శతాబ్దంలో ఘనకీర్తి కలిగిన మన ప్రభుత్వాల వైఫల్యాన్ని తెలియపరుస్తుంది. ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు పస్తులతో నిద్రిస్తుండటం, 2019 ప్రపంచ ఆకలి సూచిలో 117 దేశాలలో మనదేశం 102వ స్థానం పొందినవేళ పరిష్కార చర్యగా ‘సామూ హిక వంటశాలల ఏర్పాటుపైన స్పందించి అఫిడవిట్‌ దాఖలు చేయాలని నిరుడు సెప్టెంబరులో సర్వోన్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

నిర్ణీత గడువ్ఞలో కేవలం ఐదు రాష్ట్రాలు (పంజాబ్‌, కర్ణాటక, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌) కేంద్రపాలిత ప్రాంతాలు (అండమాన్‌ నికోబర్‌ దీవ్ఞలు, జమ్మూకాశ్మీర్‌) మాత్రమే స్పందించాయి. దాంతో ఆగ్రహించిన సుప్రీం అభిప్రాయం చెప్పని రాష్ట్రాలకు ఐదు లక్షల చొప్పున జరిమానా విధించింది. పేదవారు, సమాజపు అంచుల్లో నివసించే బలహీనుల ఆహార భద్రత విషయంలో మన ప్రజా స్వామ్య ప్రభుత్వాల నిష్క్రియపరత్వాన్ని ఈ విషయం తేటతెల్లం చేస్తుంది. ఆహారం, మంచినీరు, పోషకాహారం లభించకపోవడం నేడు విశ్వవ్యాప్త సమస్య.

జనాభా అధికంగా ఉన్న మనదేశంలో 2019 నాటికి 17 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఐదుగురు సభ్యుల కుటుంబ వార్షికాదాయం గ్రామాలలో 10,890 గాను, పట్టణాలలో 12,570 గాను ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 29.43 శాతం పేదవారు ఉన్నారు. చాలీచాలని ఆదాయాలు, కొనుగోలుశక్తి తక్కువగా ఉండటం వల్ల దేశంలోని 14.5శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆహార సంస్థ నివేదిక తెలిపింది.

భారతవైద్యపరిశోధన మండలి ప్రకారం ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణం తగిన పోషకాహారం లభించకపోవడమే.యునిసెఫ్‌ ప్రకారం ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో 38శాతం మంది ఎత్తు ఆగిపోయి గిడసబారిపోయారు. ఎస్సీ,ఎస్టీ, బిసిలలో 40శాతం బాలలు ఎదుగుదల కుంచించుకుపోయి బాధపడుతున్నారు.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లలో తక్కువబరువ్ఞగల శిశువ్ఞలు జన్మిస్తున్నారు. దేశంలోని 52 శాతం స్త్రీలు, ‘అనీమి యాతో బాధపడుతున్నారు. భావిభారత పౌరులైన బాలలు, పనిచేసే ప్రజలు, స్త్రీలు ఆకలితో అలమటించడం, చాలీచాలని ఆహారంతో జీవించడం అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నామన్న (10.2.2020న ట్రంప్‌ భారత్‌ను వర్ధమాన దేశాల జాబితాల నుండి తొలగించారు) మనకు అవమానకరమేగాక సామాజికాభివృద్ధిలో మన వెనుకబాటుతనాన్ని స్పష్టం చేస్తుంది.

బలమైన జాతినిర్మాణం కావాలంటే బలమైన ఆహారం కావాలి. మంచిఆహారం మంచి మందులతో సమానం. సమతుల ఆహారంతో శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. గర్భస్త దశలోను, పుట్ట్టాక రెండు సంవత్సరాలలోపు సరైన పోషకాహారం అందకపోతే శారీరక, మానసిక ఎదుగుదలకు శాశ్వత నష్టం జరుగుతుంది.

ఎత్తుకు తగ్గ బరువ్ఞలేకపోవడం, వయసుకు తగిన ఎత్తుపెరగక పోవడం వంటి సమస్యలకు కారణం పోషకాహార లేపమే. సన్నగా, పేలగా ఉండే పిల్లలు నిత్యం అనారోగ్యానికి గురికావడం, పాఠశా లకు గైర్హాజరవడం, తరగతి గదిలో ‘ధారణ లోపం, జ్ఞాపకశక్తి లోపం, వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అభ్యసనంపై ప్రభావం పడి వీరి భవిష్యత్తు కెరీర్‌ను కూడా ఆహారం ప్రభావితం చేస్తుంది.ఆహార భద్రత లేకపోవడం వల్ల ప్రజల్లో నిత్యం అభద్రతా భావం, ఆందోళన, అనారోగ్యం, మరణరేటు పెరగడం, సామాజిక అశాంతి, ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడం, కుటుంబ కలహాలు, వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

అణగారిన వర్గాలు, కూలీలు, వీధివ్యాపారులు, వృద్ధులు, అనారోగ్య బాధితులు, అంగవికలురు తదితర వర్గాల వారికి చౌకభోజనం లేదా ఉచిత భోజనం అందించాలనే భావన ఇప్పటికే దేశ విదేశాలలో అమలులో ఉంది. అమెరికా, యూరప్‌ దేశాలలో ‘సూప్‌ కిచెన్స్‌ అమ్మక్యాంటీన్లు (తమినళాడు), అన్నపూర్ణ రసోయి (రాజస్థాన్‌), ఇందిరా క్యాంటీన్‌ (కర్ణాటక) ఆమ్‌ ఆద్మీ క్యాంటీన్‌ (ఢిల్లీ),అన్నా క్యాంటీన్‌ (ఆంధ్రప్రదేశ్‌), ముఖ్యమంత్రి థాల్‌భట్‌ (జార్ఖండ్‌) ఆహార సెంటర్‌ (ఒడిశా) జూకాబకర్‌ (మహారాష్ట్ర), అన్నపూర్ణ (తెలంగాణ) వంటివి సామూహిక వంటశాలల్లో మార్కెట్‌ ధరకంటే తక్కువలో తాజాగా వండిన అన్నం, రొట్టెలు, వంటివి అందిస్తున్నారు.

తమిళనాడులో ఉదయం ఏడు గంటల నుండి పది వరకు, ఇడ్లీ ఒక రూపాయికి, పొంగల్‌ ఐదు రూపాయలకు, భోజనం ఐదు రూపాయలకు రాత్రి చపాతి మూడు రూపాయలకు రాత్రి తొమ్మిది గంటల వరకు అందిస్తున్నారు. దాదాపు 300 క్యాంటీన్లలో రోజుకు 2.5 లక్షల మందికి ఆహారం అందించడానికి సంవత్సరానికి 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో ఈత కొలను కంటే పెద్ద వంటపాత్రలో వండి రోజుకు ఒక లక్ష మందికి పరిశుభ్రమైన ఆహారమందిస్తున్నారు. ఇది మనదేశపు అతిపెద్ద సామూహిక వంటశాలగా ప్రసిద్ధిగాంచింది. షిరిడీలో సోలార్‌ పవర్‌ ద్వారా వండే కిచెన్‌ ద్వారా రోజుకు 40వేల మందికి, తరుపతిలో రోజుకు ఒక లక్ష మందికి, అక్షయపాత్ర ఫౌండేషన్‌ రోజుకు 1.76 మిలియన్‌ పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ ప్రజల క్షుద్భాదను తీరుస్తున్నాయి.

తెలంగాణాలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపా యలకే నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనమందించే పథకం నాలుగోవ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. పేదలకు తక్కువ ధరలో ఆహారాన్నందించే వీధి ఆహార మార్కెట్లు విఫలమవ్ఞతున్న వేల, ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు, జీతభత్యాలు తగ్గడం, పిడిఎస్‌లోని లోపాలు తదితర కారణాల వల్ల ప్రజల ఆహార భద్రత నేడు ప్రమాదంలో పడింది. అందువల్ల ప్రజలు చౌకభోజన కేంద్రాల వద్ద ఒక కిలోమీటరు వరకు క్యూలో నిల్చుంటున్నారు.

అందుకే సమస్య తీవ్రంగా ఉందని కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని 2019 ఆగస్టులో సామాజిక కార్యకర్తలయిన అనూన్‌ధావన్‌,ఇషాన్‌ ధావన్‌, కుంజానా సింగ్‌ సుప్రీంలో పిల్‌ఏర్పాటు చేయాలని ప్రజల ఆహార హక్కు, జీవించే హక్కు (21వ నిబంధన)కు భద్రత కల్పించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి, డబ్ల్యుహెచ్‌ఓ, ఎఫ్‌ఎఒల ప్రకారం మన దేశంలో రోజుకు ఏడువేల మంది,సంవత్సరానికి 25 లక్షల మంది ఆకలితో మరణిస్తున్నారని వీరు పిల్‌లో పేర్కొన్నారు.

సుప్రీం ఆదే శాల తర్వాతనైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. తమను తాము రక్షించుకోలేనివారు నిరాశ్రయులు, రోజువారి కూలీలు, కార్మిక వర్గానికి సరసమైన ఆరోగ్యకరమైన ఆహారాన్నందించడం వల్ల వారికి ఆహార భద్రత హక్కు సమకూ రుతుంది.

ధరల పెరుగుదల నుండి ఉపశమనం లభించడం, స్త్రీలకువంట పని నుండి కొంత విరామం, మహిళలలకు ఉపాధి, ప్రజల మధ్య సమైక్యతాభావన పెంపొందటం వంటి లాభాలు ఈ సామూహిక వంట శాలల ద్వారా సమకూరుతాయి.

  • తండ ప్రభాకర్‌గౌడ్‌

తాజా ‘నాడి. వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/