బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి – ప్రియాంక గాంధీ

ములుగు సభలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ..బిజెపి , బిఆర్ఎస్ పార్టీల ఫై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ప్రియాంక ఆరోపించారు. తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే తెలంగాణకు ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారన్నారు.

ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారు. తెలంగాణ వస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని ఆశించారు. కానీ, భారాస అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందన్నారు. తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వరికి రూ.2500, మొక్కజొన్నకు రూ.2200 మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ భరోసా కింద రూ.15వేలు ఇస్తామన్నారు.