ఎంపీల సస్పెన్షన్‌పై 9న రాజ్యసభ ప్రివిలేజ్‌ కమిటీ భేటి

Privileges Panel of Rajya Sabha to meet on January 9, hear 11 suspended MPs

న్యూఢిల్లీః రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 9న డాక్టర్ హరివంశ్ అధ్యక్షతన జరుగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీల సస్పెన్షన్‌కు సంబంధించిన కేసుతో సహా పలు అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. శీతాకాల సమావేశాల్లోనే 46 మంది సభ్యులను రాజ్యసభ నుంచి కూడా సస్పెండ్ చేయడం తెలిసిందే. ఇందులో 11 మందిపై సభ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. ఈ కమిటీకి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వం వహించనున్నారు. సస్పెన్షన్ వ్యవహారంపై రాజ్యసభ కమిటీ సమావేశం ఇంకా పెండింగ్‌లో ఉంది. ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు జేబీ మాథర్ హిషామ్, హనుమంతయ్య, నీరజ్ డాంగి, రాజమణి పటేల్, కుమార్ కేత్కర్, జీసీ చంద్రశేఖర్, బినోయ్ విశ్వం, సందోష్ కుమార్, ఎం మహమ్మద్ అబ్దుల్లా జాన్ బ్రిట్టాస్, ఏఏ రహీమ్‌ సస్పెండ్‌ అయ్యారు.