సీబీఐ ముందుకు మంత్రి గంగుల కమలాకర్

టిఆర్ఎస్ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కాసేపట్లో సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన..మరికొద్ది సెప్తలో సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. తాను సిబిఐ అధికారిని అంటూ చెలామణి అయ్యాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ తో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మంత్రి గంగుల ను సాక్షిగా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగులకు , శ్రీనివాస్ కు మధ్య సంబంధాలపై అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్ కు వీరితో ఉన్న సంబంధం ఏంటి..? అతనికి ఏమైనా డబ్బులిచ్చారా..? ఎప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది? వీళ్లు ఎప్పుడెప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే కోణంలో ఆరా తీయనున్నారు.