బోల్తాపడిన ప్రైవేటు బస్సు..22 మందికి గాయాలు

ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు

Private bus overturned, 22 injured in chittoor-district

అమరావతిః చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గొల్లమడుగు మలపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సికింద్రాబాద్‌కు చెందిన లలిత (65), తమిళనాడులోని మణియంబాడికి చెందిన కుబేంద్రన్ (35) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సుల్లో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.