నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లో నిలువడం ఫై చంద్రబాబు స్పందన

నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లో నిలువడం ఫై అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు సైతం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా లో పెద్ద సంఖ్యలో దీనిపై ట్వీట్స్ , పోస్టులు , కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు..నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లో నిలువడం ఫై స్పందించారు.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, దర్శకుడు రాజమౌళి, గీత రచయిత చంద్రబోస్, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు, యావత్ చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు చంద్రబాబు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సాధించారని, అలాగే ఆస్కార్ ను కూడా తప్పకుండా తీసుకువస్తారని భావిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఆస్కార్ బరిలో ఐదు పాటలు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో స్థానం దక్కించుకోగా, అందులో నాటు నాటు పాట కూడా ఒకటి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన ఈ పాట ఆస్కార్ నామినేషన్ ఖరారు చేసుకోవడం ఖాయమని విదేశీ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఇప్పుడవే నిజమయ్యాయి.

ఆస్కార్ అవార్డుల నేపథ్యంలో నేడు తుది నామినేషన్లు ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్… ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ రెండు కేటగిరీల్లో నామినేషన్ దక్కలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.