రేపు నిజామాబాద్ జిల్లాకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

pm-narendra-modi-to-nizamabad-district-tomorrow

హైదరాబాద్ : రేపు నిజామాబాద్ జిల్లాకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఇందూరు ప్రజా గర్జన సభలో పాల్గొననున్నారు. ప్రధాని టూర్ సందర్భంగా వాయుసేవ, ఎస్పీజీ అధికారులు హెలిక్యాప్టర్ల తో ట్రయల్ రన్ నిర్వహించింది .

ప్రధాని నరేంద్ర మోడీ సభకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, మూడు హెలిప్యాడ్లు సిద్దం చేశారు. అలాగే.. ప్రధాని నరేంద్ర మోడీ సభకు మూడు కిలోమీటర్ల దూరం వరకు పోలీసులు ఆంక్షలు , ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిజామాబాద్ ను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటన, 2వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా స్ధలీ, హెలిప్యాడ్ స్ధలాన్ని తమ ఆధీనంలోకి కేంద్ర బలగాలు, ఎస్పీజీ అధికారులు తీసుకున్నారు.