నేడు ముగియనున్న ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం

Prime Minister Modi will meditate for 45 hours

కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని మోడీ ధ్యానం చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన 45 గంటల దీక్ష ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు. అయితే ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే ఆధ్యాత్మిక పర్యటనలు చేయడం మోడీ అలవాటు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో 2014 ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే.. మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు పూర్తి కాగానే.. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గుహలోకి వెళ్లి అక్కడ ధ్యానం చేశారు. ఇక ఇప్పుడు రాక్ మెమోరియల్లో. వివేకానంద రాక్‌లో ధ్యానం చేసిన వివేకానందుడు.. భార‌త మాత గురించి అద్భుత విజ‌న్ చేశారు. అందుకే ఈసారి మోడీ ఇక్కడ ధ్యానం చేస్తున్నారు.

మోడీ ఈ 45 గంటల ధ్యానంలో కేవలం లిక్విడ్‌ డైట్‌ను మాత్రమే తీసుకుంటున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం, ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే తాగుతూ వస్తున్నారు. ఇక ధ్యానం సందర్భంగా మోదీ మౌనంగా ఉంటున్నారు.. ఆ ధ్యాన మందిరంలో ఉన్నారు. కాషాయ వస్త్రాలు ధరించి.. వివేకానంద రాక్ మెమోరియల్ పరిసర ప్రాంతాల్లో నరేంద్ర మోదీ తిరిగిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.