కాంతారా చిత్రాన్ని చూడబోతున్న ప్రధాని మోడీ..?

కాంతారా ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద నార్త్ సినిమాల హవానే నడిచేది. సినిమా అంటే బాలీవుడ్..బాలీవుడ్ అంటేనే సినిమా అని అంత మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు ఆలా కాదు సినిమా అంటేనే సౌత్ సినిమా అని బల్లగుద్ది చెపుతున్నారు. బాహుబలి-1′.. ‘బాహుబలి-2’.. ‘కేజీఎఫ్-1’.. ‘కేజీఎఫ్-2’.. ‘పుష్ప’.. ‘కార్తీకేయ-2’ ఇలా సౌత్ సినిమాలు నార్త్ లో హావ కొనసాగించాయి. ఇక ఇప్పుడు కాంతారా చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కన్నడ లో విడుదలై…అక్కడ సూపర్ హిట్ తెచ్చుకొని , ఆ తర్వాత తెలుగు , హిందీ పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు ..వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమాను చూడాలని సినీ లవర్స్ మాత్రమే కాదు రాజకీయ నేతలు సైతం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో దేశ ప్రధాని మోడీ సైతం కాంతారా సినిమాను చూడాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ 14న ప్రధాని మోడీ ‘కాంతారా’ దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి కలిసి ప్రత్యేక స్క్రీనింగ్ లో తిలకించనున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘కాంతారా’కు ఈ న్యూస్ మరింత బూస్ట్ ఇవ్వడం ఖాయం కన్పిస్తోంది. ఈ సినిమా చూశాక ప్రధాని మోడీ ఏవిధంగా స్పందిస్తారో అనేది ఆసక్తికి రేపుతోంది.