డీఏవీ స్కూల్ ఘటన మరువక ముందే వెలుగులోకి మరో దారుణ ఘటన

హైదరాబాద్ డీఏవీ స్కూల్ ఘటన మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే నగర్లోని గ్రేస్ అనాథాశ్రమంలో బాలికపై అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న గ్రేస్ అనాథాశ్రమానికి చెందిన నలుగురు బాలికలు కనిపించకుండా పోయారు. వీరి ఆచూకీ కనిపించకపోవడం తో పోలీసులకు పిర్యాదు చేసారు. తప్పిపోయిన వారిలో ఒకమ్మాయి మేజర్ కాగా.. మిగిలిన ముగ్గురు మైనర్లు గా ఫిర్యాదులో పేర్కొన్నారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. తప్పిపోయిన వారిలో ఇద్దరు బాలికలు సికింద్రాబాద్ లో దొరకగా.. రెండ్రోజుల తర్వాత మరో ఇద్దరు సంగారెడ్డిలోని తమ బంధువుల ఇంట్లో దొరికారు.

వారందరినీ కౌన్సిలింగ్ కోసం సఖి సెంటర్ కు తరలించి విచారించగా..దారుణ విషయం బయటపెట్టారు. గ్రేస్ అనాథాశ్రమంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న మురళి లైంగికంగా వేధించినట్లు ఓ బాలిక తెలిపింది. ఆ కారణంగానే అక్కడ ఉండటం ఇష్టంలేక తప్పించుకుని పోయినట్లు తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదుచేసిన గోపాలపురం పోలీసులు నిందితుడు మురళిపై పోక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, గ్రేస్ అనాథశ్రమం నిర్వాహకుడు విక్టర్ అతని భార్య భవానిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి రిమాండ్ కు తరలించారు.