చెమట వాసన పోవాలంటే …

వేసవిలో జాగ్రత్తలు , జీవన శైలి

prevent the smell of sweat
prevent the smell of sweat

వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బ , దద్దుర్లు వంటి వాటితోపాటు శరీర దుర్వాసనా ఇబ్బంది పెడుతుంది.. కొందరిలో మరీ ఎక్కువగా ఉంటున్న సమస్య… మరి దీన్ని నియంత్రించుకోవాలంటే…

వేసవిలో చెమట నుంచి తప్పించుకోవాటానికి ప్రిక్లీ హీట్ పౌడర్లు , డియోడరెంట్స్ వాడుతుంటారు.. అయినా సమస్య పూర్తిగా సమసిపోదు.. పాదాలు, జననాంగాలు, బాహు మూలాలు, చెవులు, జుట్టు.. ఈ ప్రాంతాలలో చెమట పట్టి దుర్ఘనడం మొదలవుతుంది… ఇలాంటప్పుడు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి..

వేసవిలో ఎక్కువ ఘాటు వాసన ఉండే చేపలు, వెల్లుల్లి, ఉల్లి వంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి..
ఎక్కువ నీటిని తాగాలి.. అపుడే మలినాలు బయటకు పోయి శరీరం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది… నీరు తగినంత తాగక పోటీ శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తాయి.. దీంతో ఎక్కువ చెమట పడుతుంది… వాసన కూడా, .. పండ్ల రసాలు, కొత్తిమీర , పుదీనా జ్యూస్ తాగితే మంచిది..
ఈ కాలం రోజూ రెండు పూటలా స్నానం చేయాలి.. నాణ్యమైన డియోడరెంట్స్ ఉపయోగించాలి.. కాళ్లను బాగా శుభ్రం చేసుకోవాలి… అలాగే ఈ కాలంలో సాక్స్ ధరించకుండా ఉంటే మేలు .. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే రోజూ మార్చాల్సిందే..

‘నాడి ‘ (ఆరోగ్య సలహాలు, సూచనలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/