సరుకులు కొనేటపుడు జాగ్రత్త!

హ్యాండ్‌ శానిటైజర్స్‌ వెంటతీసుకెళ్లటం తప్పనిసరి

Be careful when buying goods!
Be careful when buying goods!

సరుకులు కొనేందుకు కిరాణా దుకాణం కాని సూపర్‌ మార్కెట్‌ కాని వెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలి.

సరుకులు కొనేందుకు వచ్చిన వారు ప్యాకింగ్‌ చేసి ట్రేలలో ఉంచిన వాటిని చూసేందుకు చేతితో తీసి పెడుతుంటారు.

మనం కూడా అవే వస్తువులను తీసుకోవాల్సి వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వేళ కాస్త ముందుగానే సరుకులు కొనేం దుకు వెళ్లడం మంచిది.

ఎందుకంటే ఆ సమయంలో తక్కువ మంది ఉంటారు. సరుకులు తొందరగా కొని బయటకు రావచ్చు. బయటకు వెళ్లే ప్రతిసారి హ్యాండ్‌ శానిటైజర్‌ను తీసుకెళ్లం మంచిది.

Hand sanitizers‌

స్టోర్‌లో కూడా మిగతా కస్టమర్లకు ఆరడుగుల దూరం పాటించాలి.

నోరు, ముక్కు కవల్‌ అయ్యేలా మాస్క్‌ ధరించాలి. షాపులో ఉన్నంత సేపు కళ్లు, ముక్కు, నోరు ముఖాన్ని ముట్టుకోవద్దు.

సాధ్యమైనంతవరకు కార్డు, నగదు బదులు ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించాలి. ఆ తరువాత శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.

కావాల్సిన నిత్యావసరాలు పప్పులు, కూరగాయలు, ఇతర వస్తువులు ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడం మంచిది.

Use of sanitizers

డెలివరీ సమయంలో కూడా ఫోన్‌పే, గూగుల్‌పే వంటి విధానంలో డబ్బు చెల్లిస్తే మంచిది.

డెలివరి బాయ్ తెచ్చిన వస్తువులను నేరుగా తీసుకోకుండా ఇంటి ముందర పెట్టి వెళ్లమని చెప్పి పార్సిళ్లను దూరంగా ఉండి తీసుకుంటే మంచిది.

తప్పనిసరైతే బయటికి వెళ్లాలి. మరీ ముఖ్యంగా జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉంటే కండరాల నొప్పి, తలనొప్పి వంటివి ఉంటే బయటకు వెళ్లకపోవడమే మంచిది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/