ఆత్మవిశ్వాసంతో నడుచుకోవాలి

జీవన వికాసం

Confidence
Confidence

బతకడం వేరు, జీవించడం వేరు. బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. సంతృప్తి చెందిన జీవితంలో అనుభూతి ఉంటుంది. ఒదిగి వుండటం తెలిసిన వాళ్లకే ఎలా అధిపత్యం చేయాలో తెలుస్తుంది. అన్నీ కోల్పోయినా ఆత్మ విశ్వాసం కోల్పోకూడదు. అదోక్కటే ఉంటేచాలు మనం కోల్పోయిన వాటన్నీంటినీ తిరిగి దక్కించుకోవచ్చును. మనల్ని గుర్తించాల్సిన అవసరం ప్రపంచానికి లేదు.

మనలో ఏముందో ప్రపంచం గుర్తించేలా చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే వుంది. అపుడే అది మనకు జోహార్లు అర్పిస్తుంది. మీరు తప్పు చేసినపుడు మీ తప్పును ఒప్పుకోండి. ఆ విషయంలో ప్రశ్నించినపుడు వివరణ ఇవ్వండి.

మీకు సందేహం ఏర్పడినపుడు విమర్శించకండి. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పరవాలేదు. కాని అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చేసే గుణం ఉండాలి.

అభినందించే మంచి మనసు కూడ ఉండాలి. మీరు చేరే గమ్యం, మార్గంలో ఎవరిని పూర్తిగా నమ్మకండి నిన్నుతప్ప. ఎవరి మీద ఆధారపడకండి. మీ ఆత్మవిశ్వాసంతో నడిచే సామర్ధ్యం కలిగివుండాలి.పగిలిన అద్దాన్ని అతికించలేని అసహాయతను తలచుకొని రోదించటం కంటే సంస్కృతి నుంచి విసిరేసిన అద్దం అందాన్ని బతుకునిండా నింపుకోవడమే జీవితం.

జీవితమనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపద అయితే ఆత్మీయులు, స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు లేకపోయినా చెట్టు బతుకుతుంది. కాని వేర్లు లేకపోతే బతకలేదు. విజయం గొప్పది కాదు. సాధించినవాడు గొప్ప, బాధపడటం గొప్పకాదు, బాధను తుట్టకోవడం గొప్ప, బాంధవ్వాలు గొప్పకాదు, వాటిని నిలబెట్టే వాడు గొప్ప. మీ కోసం బతకడంలో మీకొక్క ఆనందం మాత్రమే ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/