చేపల కుర్మా

రుచి: వెరైటీ వంటకాలు

Fish curry
Fish curry

కావాల్సినవి:

బొచ్చ చేప ముక్కలు-5, అల్లం వెల్లుల్లి ముద్ద- 2 చేయించాలి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు-పావుకప్పు చొప్పున, పచ్చి మిర్చి-5, కరివేపాకు రెబ్బలు-కొన్ని, పసుపు-చెంచా , ఉప్పు-రుచికి తగినంత, ధనియాల పొడి- జీల కర్ర పొడి,- చెంచా చొప్పున, మెంతి పొడి- అర చెంచా, కారం- 4 చెంచాలు, గరం మసాలా పొడి – చెంచా, చింతపండు- నిమ్మ కాయ అంత, కొత్తిమీర తరుగు-కొద్దిగా, నూనె- పావు కప్పు..

తయారు చేసే విధానం:

చేప ముక్కలను ఉప్పు, పసుపు, కారం, అర చెంచా వెల్లుల్లి ముద్దా పట్టించి అర గంట నానబెట్టాలి ఇపుడు బాణలిలో కొద్దీ నూనె వేడిచేసి చేప ముక్కలను వేయించాలి… మరో బాణలిలో మిగిలిన నూరు వేడి చేసి ఉల్లి పాయ ముక్కలు వేయించి మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద, మరి కాస్త ఉప్పు, కారం , ధనియాల పొడి, జీల కర్ర చేర్చాలి… ఆ వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసి కొద్దిగా మెంతిపొడి చల్లాలి. ముక్కలు ఉడికి దగ్గరయ్యాక మసాలా పొడి, కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది… వేడి వేడి చేపల కుర్మా సిద్ధమవుతుంది .

‘తెర’ (సినిమా) వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/