చెలి కానుక

మహిళలకు చిట్కాలు

Kitchen Tips
Kitchen Tips

గులాబ్‌ జామ్‌ చేసినప్పుడు చక్కెర ఎక్కువగా మిగిలితే అందులో వేయించిన గోధుమరవ్వ వేసి ఉడికించి హల్వా చేసుకోవచ్చు.

బెల్లంతో శనగపప్పు ఉండలు చేసేటప్పుడు బెల్లంలో కొంచెం పంచదార కలపండి. ఇలా చేస్తే శనక్కాయపప్పు ఉండలు త్వరగా మెత్తబడవు.

ఫ్లాస్క్‌ వాడనప్పుడు దానిలో పావుచెమ్చా పంచదార వేయండి. దుర్వాసన రాదు.

చపాతీలు చేసేటప్పుడు గోధుమపిండిలో నీళ్లకు బదులుగా పాలు కలిపితే చపాతీలు మెత్తగా, చాలా రుచిగా ఉంటాయి.

పాలల్లో అల్లపు రసము వేసి కొద్దిగా పంచదారను వేసి కాచి తాగితే ఉదరానికి సంబంధించిన రోగాలు త్వరగా తగ్గుతాయి.

బార్లీ గింజలను బాగా ఉడకబెట్టి ఆ నీళ్లలో పాలు పంచదార వేసుకుని రోజూ రెండుపూటలా తాగితే వేడి ఎక్కువగా ఉన్న వారికి మంచి ఫలితం ఉంటుంది.

మిరియాలపొడి నిమ్మరసం కలిపి రాత్రిపూట తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

ఆపిల్‌ పండు ముక్కలను మరిగించి వడకట్టి చల్లారిన తరువాత తేనె కలిపి కళ్లు కడుక్కునేందుకు వాడుకుంటే కళ్లు తాజాగా ఉంటాయి.

గర్భవతులకు వాంతులు ఎక్కువగా అవుతుంటే కొబ్బరి నీరు మజ్జిగ నీటిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే తగ్గుతాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/