నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ కొట్టివేత

వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు

president-convict
president-convict

న్యూఢిల్లీ: నిర్భయ దోషులో ఒకడైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్షమాభిక్షను పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. తనకు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని వినయ్ శర్మ కోరాడు. దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఈ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష అమలు చేసేందుకు వీలు కలగనుంది. ఈ కేసులో మొదటి నుంచీ ఉరిశిక్ష అమలవ్వకుండా దోషులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే… దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్ తనకు విధించిన ఉరిశిక్షణను సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ కొట్టివేయడంతో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఇలా ఎన్ని నాటకాలాడినా ఫిబ్రవరి 1న నలుగురికీ ఉరిశిక్ష అమలు చెయ్యాలని అంతా సిద్ధమైతే… చివర్లో మళ్లీ మెలిక పెట్టారు. ఫలితంగా శనివారం ఉదయం 6 గంటలకు జరగాల్సిన ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. నెక్ట్స్ తేదీ ఏదనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/