ములాయం సింగ్ యాదవ్ కు కిడ్నీ ఇస్తాః పార్టీ నేత అజయ్ యాదవ్

విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం

mulayam-singh-yadav-in-critical-care-unit-in-medanta-hospital

లక్నో : సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ఆరోగ్యంగా ఇంకా విషమంగానే ఉన్నది. అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ కోసం అవసరమైతే కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారు. పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ రాయ్ మాట్లాడుతూ.. ‘నేతాజీ’ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికీ అవసరమని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారణాసిలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు చెప్పారు.

కాగా, ములాయం చికిత్స పొందుతున్న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి ఎవరూ రావొద్దని సమాజ్ వాదీ పార్టీ కోరింది. ములాయంకు ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ఆసుపత్రికి వెళ్లినా ‘నేతాజీ’ని కలవడం సాధ్యం కాదని, కాబట్టి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. ములాయం ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు, ములాయం తర్వగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/