ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థిక శక్తి

ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం

New Delhi: ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో 2020 బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు 40కోట్ల మంది జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేశారన్నారు.

డిజిటల్ లావాదేవీలు పెరిగాయి

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని చెప్పిన నిర్మలా సీతారామన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటి వరకూ 40 మంది జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేసినట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే దేశ ప్రగతి వేగంగా సాగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. సబ్ కా సాత్..సబ్ కా వికాస్..సబ్ కా విశ్వాస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన నిర్మలా సీతారామన్ ప్రభఉత్వం ఖర్చు చేసే ప్రతి పైనా నేరుగా నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థిక శక్తి 

ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థిక శక్తి అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. 284 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు.

పాలనలో కొత్త పుంతలు

కేంద్రంతో తాము అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో కొత్త పుంతలు తొక్కామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కు చరమగీతం పాడామని ఆమె అన్నారు. దీనివల్ల చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు లాభం జరిగిందని ఆమె చెప్పారు. 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారు. రిటర్న్స్‌లో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.

ప్రపంచంలో మనది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ:

ప్రపంచంలో ఇప్పుడు మనది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి 4 శాతం ఆదా అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రుణాలు గణనీయంగా తగ్గాయన్నారు. 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారన్నారు. రిటర్న్స్‌లో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. 40 కోట్ల మంది పన్ను రిటర్నులు ఫైల్‌ చేశారన్నారు. ఏప్రిల్‌ 2020 నుంచి పన్ను రిటర్నులు మరింత సులభం చేస్తామన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/