బనానా కుర్మా

రుచి: వంటకాల తయారీ

Banana Kurma

కావలసిన పదార్థాలు

అరటి కాయలు – ఎనిమిది
బంగాళా దుంపలు – అరకేజి
పెరుగు – పావుకేజీ
ఉల్లిపాయలు -రెండు
నూనె – సరిపడినంత
టొమాటోలు – నాలుగు
క్రీమ్‌ – 300 గ్రాములు
కొత్తిమీర – ఒక కట్ట
ఉప్పు -తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – రెండు టేబుల్‌స్పూన్‌లు
పచ్చిమిర్చి- అయిదు
జీలకర్ర – ఒక టీస్పూన్‌
పసుపు – అర టీ స్పూన్‌
కారం – ఒక టీస్పూన్‌
ఆవాలు – ఒక టీ స్పూన్‌

తయారుచేయు విధానం

ఒక పాన్‌లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేయాలి. కాసేపు వేగిన తరువాత పెరుగు వేయాలి.

బంగాళదుంప ముక్కలు, అరటికాయ ముక్కలు వేసి కలపాలి. ఇవి లేత గోధుమరంగులోకి వచ్చిన తరువాత టమోటా ముక్కలు కూడా వేసి పావు గంటపాటు చిన్న మంటపై ఉడికించాలి.

టమోటాలు బాగా ఉడికిన తర్వాత రుచికి తగ్గ కారం వేయాలి.

ఈ మిశ్రమంలో క్రీం వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తమీరతో గార్నిష్‌ చేసి అన్నంతో లేదా చపాతీతోను తినవచ్చు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/