మెగాస్టార్ ఇంటికి కెజిఎఫ్ డైరెక్టర్..

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి చేసారు. ‘దసరా పర్వదినాన చిరంజీవి ని కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని .. చిరంజీవిని కలవడంతో నా చిన్ననాటి కల నేరవెరింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే రామ్ చరణ్‌తో ఓ మూవీ తీయబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో కలిసి సినిమాలు చేయనున్నాడని వినికిడి. ఇక రామ్ చరణ్.. ‘ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ షూటింగ్‌లు పూర్తి కావడంతో శంకర్ మూవీని మొదలు పెట్టాడు. ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం ప్రశాంత్ నీల్-చెర్రిల చిత్రం పట్టాలెక్కునుందని తెలుస్తోంది.