చంద్రబాబు కు భారీ షాక్ ఇచ్చిన సొంత కార్యకర్తలు

chandrababu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కు సొంత పార్టీ కార్యకర్తలు పెద్ద షాక్ ఇచ్చారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జ్‌గా గవిరెడ్డి రామానాయుడిని కొనసాగించాలని వారంతా డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీ ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తామని చీడికాడ మండల పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

తురువోలులో మాజీ ఎంపీపీ రమణమ్మ అధ్యక్షతన మండల కమిటీ, కార్యకర్తల అత్యవసర సమావేశం జరిగింది. సమావేశానికి మండలంలోని 23 పంచాయతీల నుంచి పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఓటమి చెందినా కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడని.. ఇంఛార్జ్ మార్పుపై నెలాఖరులోగా పార్టీ అధిష్టానం పునఃపరిశీలన చేయాలని కోరారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని నీనియర్‌ నాయుకులు, గ్రామ కమిటీ, ప్రజా ప్రతినిధుల సూచనలతో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు.