నేటి నుంచి ప్రణయ్‌ హత్య కేసు విచారణ

pranay honour killing case enquiry
pranay honour killing case enquiry

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో మంగళవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడు, అమృత ప్రణయ్‌ తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో విచారణ సందర్భంగా తమ న్యావాదులను మార్చుకోవడానికి మారుతీరావు అనుమతి కోరారు. దీంతో న్యాయస్థానం న్యాయవాదులను మార్చుకునేందుకు అనుమతిచ్చింది. అయితే ఈ కేసుపై మంగళవారం నుంచి జిల్లా స్పెషల్‌ కోర్టులో ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. మారుతిరావు మూడు రోజుల క్రితం ఆత్మహత్య కు పాల్పడిన నేపథ్యంలో… మారుతిరావు ఆత్మహత్యపై నేడు న్యాయస్థానానికి సంబంధిత న్యాయవాదులు సమాచారం ఇవ్వనున్నారు.

2018 సెప్టెంబర్‌ 14 న ప్రణయ్‌ మెడికల్‌ చెకప్‌ కోసం అమృతను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఇంటికి బయలుదేరుతుండగా హాస్పిటల్‌ గేటు దాటకముందే కిరాయి హంతకుడు అతడిని నరికి హత్య చేశాడు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావుతో పాటు ఆయన సోదరుడు శ్రవణ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆరు నెలల కిందట వీరిద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/