ప్లీనరీకి చేరుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ హైటెక్స్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. టిఆర్ఎస్ ప్లీనరీ సందర్బంగా హైదరాబాద్ రోడ్లు గులాబీ మయంగా మారాయి. టిఆర్ఎస్ ప్రతినిధులు హైటెక్స్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 40 ఎకరాలల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సోమవారం సాయంత్రం వరకు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాసేపట్లో హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ప్లీనరీ వేదికపై జెండా ఆవిష్కరించనున్నారు. ప్లీనరీలో అధ్యక్షుడి ఎన్నికతో పాటు పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్లీనరీలో 7 అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు సమాచారం.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/