రాజ్యసభకు కవిత పేరు ఖరారు?

K. Kavitha
K. Kavitha

హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థుల విషయం లో గట్టి పోటీ నెలకొంది. కాగా టిఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు మాత్రమే రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో పేర్ల ఖరారు పైన ముఖ్యమంత్రి కెసిఆర్‌ తుది కసరత్తు చేస్తున్నారు. అందులో అనేక మంది తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించగా..ఆచి తూచి కెసిఆర్‌ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ మాజీ సభ్యురాలు కవిత ను పెద్దల సభకు పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురిలో ఇద్దరు పదవీ విరమణ చేశారు. మిగిలిన ఐదుగురిలో నలుగురు బీసీలే ఉన్నారు. దీంతో..ఈ సారి కవితతో పాటుగా రెండో సీటు కోసం ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తల మధ్య పోటీ నెలకొని ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ రాత్రికి రెండు పేర్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/