క్షీణిస్తున్న ప్రణబ్ ఆరోగ్యం..ఆర్మీ ఆసుపత్రి
ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారన్న ఆర్మీ ఆసుపత్రి

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రమైన కోమాలో ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ బుధవారం ప్రకటించింది. ఆయన ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకిన విషయం తెలిసిందే. ఆయనకు కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి తాజాగా బులెటిన్ విడుదల చేసింది. ప్రబణ్ ముఖర్జీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు చికిత్స అందుతోందని, నిన్నటి నుంచి, కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు బాగాలేదని తెలిపింది. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.
ప్రణబ్ ముఖర్జీ కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ కావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఆర్మీ హాస్పిటల్లో ఈ నెల 10న బ్రెయిన్ సర్జరీ జరిగింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/